
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంథని గ్రామంలో అధికారులతో కలిసి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లు పెంచడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మీద ఈ చెట్లు నాటి వారికి అంకితం చేయాలని అన్నారు. ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించాలని ఉద్దేశంతో ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయంలో కేవలం ఫోటోల కోసం మాత్రమే చెట్లు నాటే వారని ఏటా 200 కోట్ల ఖర్చు పెట్టి రెండు లక్షల మొక్కలు కూడా నాటని అసమర్ధ ప్రభుత్వం గత ప్రభుత్వమని సెలబ్రిటీలతో ఫోటోలకు మాత్రమే చెట్లు నాటే వారని ఇకనైనా వ్యక్తులు ఈ ప్రకృతిని కాపాడే విధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు