
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కు JNTUH నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ( డేటా సైన్స్) కొత్త కోర్సు కు ఈ విద్యా సంవత్సరం 2025 -26 నుండి అనుమతి లభించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ తెలిపారు. ఈ కొత్త కోర్సు ప్రస్తుతం జరుగుతున్న TG EAPCET -2025 కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇంజనీరింగ్ లో చేరబోయే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.