
జయ్ న్యూస్, మోర్తాడ్:
*ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీసు కమిషనర్*
*సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశం*
*ఫోక్సో , గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి*
*అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం , పి.డి.యస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి , పటిష్ఠమైన చర్యలు*
*సైబర్ నేరాల పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి*
*రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృషి , ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల పైన అవగాహన కల్పించాలి*
నేడు సాయంత్రం సమయంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్., ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ క్రింది విషయాలు చర్చించడం జరిగింది.
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని , పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్ , నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి , గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి సి.సి.టి.యన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని , పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు.
గ్రామ పోలీసు అధికారులు ( VPO ) ప్రతీ రోజు గ్రామానికి సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు.కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.
సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృ ష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి , సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలిగించే విధంగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలున్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ కృషి చేయాలని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని , ఓవర్ స్పీడ్ , ట్రిపుల్ డ్రైవింగ్ , మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించాలని అన్నారు.
విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.
అసాంఘిక కార్యకలాపాలు గంజాయిని ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా క్రయ విక్రయాల పైన , జూదం , పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రిపీటెడ్ గా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి జే. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూరు సిఐ సత్యనారాయణ , బాల్కొండ సిఐ శ్రీధర్ రెడ్డి , భీంగల్ సిఐ పొన్నం సత్యనారాయణ , ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ , ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ , మెండోరా ఎస్సై సుహాసిని , మోర్తాడ్ ఎస్సై రాములు , నందిపేట ఎస్సై శ్యామరాజ్ , భీంగల్ ఎస్సై సందీప్ , కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డి , బాల్కొండ ఎస్సై శైలేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది.