
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శనివారం రోజు ప్రీ ప్రైమరీ విద్యార్థుల కు గ్రీన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి, ఆకుపచ్చ ఆకులు,పండ్లు, కూరగాయలు, మొక్కలతో వివిధ చార్టులు మోడల్స్ ప్రదర్శించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకంలో పర్యావరణం యొక్క ప్రాముఖ్యత, చెట్లు నాటి వాటిని పరిరక్షించే తీరును చిన్నారులకు సరళమైన భాషలో వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ పాల్గొని మాట్లాడుతూ పిల్లల్లో పచ్చదనంపై ప్రేమను పెంపొందించాలని, ఇలాంటి కార్యక్రమాలు వాళ్లకు ప్రకృతి విలువలను నేర్పడంలో ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..