
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ ఐదవ వార్డులో ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా లబ్ధిదారునికి ప్రభుత్వం నుండి మంజూరైన లక్ష రూపాయల చెక్కును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి అందజేశారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇంటి నిర్మాణం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, తాజా మాజీ స్థానిక కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్, తాజా మాజీ వైస్ చైర్మన్ మున్ను, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.