
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కింది బజార్లో శ్రీ బాలాజీ జెండా నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలాజీ జెండాను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం జెండాను ప్రతిష్టించారు. శ్రీ బాలాజీ జెండా నవరాత్రి ఉత్సవాలు ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్నాయి. జూలై 30న బుధవారం లక్ష పుష్పార్చన, అమ్మవార్లకు కమల పుష్పార్చన జరగనుందని జెండా మధుకర్ శర్మ, మనోహర్ శర్మలు తెలిపారు. అలాగే ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, సాయంత్రం 5 గంటలకు సహస్రనామార్చన ఉంటుందన్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు స్వామివారికి పవళింపు సేవ జరగనుంది. 30వ త్రియాహ్నిక విష్ణు యాగ మహోత్సవం జూలై 31న గురువారం నుండి ఆగస్టు 2వ తేదీ శనివారం వరకు నిర్వహించనున్నారు. ఆగస్టు 1న లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటుంది. ఆగస్టు 2న శనివారం పూర్ణాహుతి, స్వామివారి డోలారోహణము, ఆగస్టు 5న అంగరంగ వైభవంగా మంగళవారం జెండా జాతర జరగనుంది.