
జయ్ న్యూస్, సిరికొండ: మంగళవారం సాయంత్రం సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS., సిరికొండ మండలంలో గల కొండూరు మరియు తుంపల్లి గ్రామాలలో వరద ప్రభావితానికి గురయ్యే బ్రిడ్జిలను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఈ దిగువ ప్రదేశాలను పర్యవేక్షించడం జరిగింది.
1) కొండూరు గ్రామ సరిహద్దులో గల వాగు
2) తుంపల్లి నుండి పాకాల మార్గ మధ్యలో గల కప్పల వాగు
3) సిరికొండ నుండి న్యావనంది మార్గమధ్యలో గల వాగు దొoడ్ల వాగు మొదలగునవి క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతున గ్రామ ప్రజలకు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల భద్రతకు సంబంధించి కీలక సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా, గ్రామ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల అవసరం, ప్రాముఖ్యత గురించి వివరించి, ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి ఇన్స్పెక్టర్ బిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.