
జయ్ న్యూస్, ఆర్మూర్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కీలక ప్రణాళిక సిద్ధం చేసింది. రానున్న శనివారం మరియు ఆదివారం (ఆగస్ట్ 2,3 తేదీలలో) ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రెండు రోజుల శనివారం పాదయాత్ర మరియు ఆదివారం శ్రమదానం మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం, అర్గుల్ రోడ్డు వెళ్లే మార్గంలో యమునా గార్డెన్స్ లో జరగనుంది. దీనికి ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆలూర్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆర్మూర్ పట్టణం వరకు పాదయాత్ర చేస్తూ, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. రాత్రికి ఆర్మూర్ పట్టణం C కన్వెన్షన్ హాల్ లో బస చేసి, శ్రమదానంలో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలోని స్థానిక సమస్యలు తెలుసుకొని, పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించాలన్నదే మీనాక్షి నటరాజన్ టీపీసీసీ నాయకత్వం ఉద్దేశం.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, తెలంగాణ పిసిసి జనరల్ సెక్రెటరీ నరేష్ జాదవ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మాజీ నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, నందిపేట్ మండల అధ్యక్షులు మంద మైపాల్, రవి, భూమేష్ రెడ్డి, చిన్నారెడ్డి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.