
జయ్ న్యూస్, నిజామాబాద్: బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ హాల్ యందు సైబర్ వారియర్స్ కి సైబర్ నేరాల మీద వాటి నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ వారియర్స్ ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి పోలీస్ సిబ్బంది ఈ రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం. అందుకే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ “సైబర్ నేరాలు నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలి. ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు వంటి నూతన పద్ధతులపై అప్రమత్తంగా ఉండాలి. ప్రతి కేసును సీరియస్‌గా తీసుకుని బాధితులకు తక్షణమే న్యాయం కల్పించాలి.
అంతేకాక, కమిషనర్ సూచించినవి:
• సైబర్ సెల్‌ను బలోపేతం చేయాలి.
• ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ నేరాలపై నిపుణులుగా ఏర్పడాలి.
• ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
• 1930 మరియు https://www.cybercrime.gov.in నెంబర్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలి.
సైబర్ నేరాలపై సమగ్ర అవగాహనతోనే సమర్థవంతమైన చర్యలు తీసుకోవచ్చు. అందుకే పోలీస్ సిబ్బంది నిరంతరం నూతనమైన జ్ఞానం నేర్చుకోవాలి అని కమిషనర్ అన్నారు.
ఇప్పటి వరకు నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో తేది: 1-1-2024 నుండి తేది : 29-7-2025 వరకు మొత్తం 759 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా రూ: 3,27,12,397-84 రూపాయలు కోర్ట్ ల ద్వారా సంబంధిత భాధితులకు డబ్బులు రిఫoడ్ చేయడం జరిగింది.
అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేటటువంటి సైబర్ వారియర్స్ అందరికీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ వారి ” టీ షర్ట్స్ ” అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై. వెంకటేశ్వరరావు, డిఎస్పీ సైబర్ క్రైమ్ పిఎస్ , మహమ్మద్ ముఖిద్ పాషా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఎం ప్రవళిక సబ్ ఇన్స్పెక్టర్ , శ్రీనివాస్ , శ్రీరామ్ , సురేష్ , నాగభూషణం , నరేష్ , ప్రవీణ్, రాఘవేంద్ర, సుమలత , శృతి , రమ్య , సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.