
జయ్ న్యూస్, ఆర్మూర్:
*బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి*
-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి
-బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి
ఆర్మూర్ జులై 30 : బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటిని అధిగమించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో కులగణనను పక్క ప్రణాళికతో పూర్తిగా పారదర్శకంగా, శాస్త్రీయంగా కులగనను పూర్తి చేసిందన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గత శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదింప చేసిందన్నారు. కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసిందనీ, తెలంగాణలో కులగణన చేయడంతో ఆ ఒత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం 2026 లో జరిగే కులగణనను చేర్పించిందన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గవర్నర్ కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదో స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసి రిజర్వేషన్లకు అడ్డుపడే రాజకీయ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 42 శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించి చట్టబద్ధత కల్పించాలని లేకపోతే టిపిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు బీసీ నాయకులు అందర్నీ కలుపుకుపోయి రానున్న సంస్థ గత ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఆర్మూర్ మున్సిపాలిటీ యందు కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.