
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వైష్ణవ సేవా సంఘం శ్రీమాన్ శ్రీ మర్రి పెళ్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ నైవేద్యాలలో 50 శాతం శ్రీ వైష్ణవ కుటుంబాల కు కేటాయించాలని ఎండోమెంట్ దేవాలయాల్లోని కటాఫ్ అప్డేట్ ఎత్తివేయాలని బ్రాహ్మణ పరిషత్ పునర్ ప్రారంభించాలని కోరారు. దేవాలయ కమిటీలలో శ్రీ వైష్ణవులకు స్థానం కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శ్రీ వైష్ణవ సేవా సంఘం అధ్యక్షుడు తీరామ రంగం ప్రభాకర్ ఆచార్యులు, రాష్ట్ర జేఏసీ చైర్మన్ పీచర్ కృష్ణమాచార్యులు ఆర్మూర్ సంఘ నాయకులు మర్రిపల్లి సత్యనారాయణ చార్యులు, వెంకటేశ్వర దేవాలయం అర్చకులు చిలకమర్రి ఆనందాచార్యులు, కన్యకా పరమేశ్వర అర్చకులు కాండూరి రాజగోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు.