
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో ఈరోజు వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండగలలో ఒకటి. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పురోహితులు నంబి శౌర్య ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు మరియు విద్యార్థుల యొక్క మాతృమూర్తులు (తల్లులు) సామూహికంగా ఈ వరలక్ష్మీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల తరఫున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించనైనది. పాఠశాలలో జరిగిన ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సయ్య, వారి సతీమణి శ్రీమతి విజయ, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ పి సాయిచరణ్ పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.