
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల రైతుల కోసం దాదాపు 2850 ఎకరాల సాగు కోసం కొనసాగుతున్న పోచంపాడు బ్యాక్ వాటర్ లిఫ్ట్ పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి, నాయకులతో కలిసి పరిశీలించారు.
వినయ్ రెడ్డి మాట్లాడుతూ లిఫ్ట్ పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్, నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్, మచ్చర్ల కాంగ్రెస్ నాయకులు జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.