
జయ్ న్యూస్, ఆర్మూర్: రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెల అనుబంధాన్ని, ప్రేమను, రక్షణను ప్రతిబింబించే పవిత్రమైన రోజు. ఈ రోజు చెల్లెలు తన అన్నకు రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తుంది. అన్న తన చెల్లిని ఎప్పటికీ రక్షిస్తానని, జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ మనసుల్లో అనురాగం, విశ్వాసం పెంచుతుంది. రక్త సంబంధం మాత్రమే కాకుండా స్నేహ బంధాలు, ఆత్మీయ సంబంధాలను కూడా బలపరిచే రోజుగా రక్షాబంధన్ నిలుస్తుందని థోండి రమణ అన్నారు. ఇట్టి సందర్భంగా రానున్న రోజుల్లో తమ్ముడు థోండి రమణ రాజకీయంగా ఎదిగి అందరి మన్ననలు పొందాలని అక్క ఉషారాణి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులందరూ అక్కలు ఉమారాణి, ఉషారాణి, గంగామణి కుటుంబ సభ్యులు మణి నిశ్ఛయ్ రణతేజ్ ఆనందంగా పండుగ జరుపుకున్నారు.