
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులోని పెద్దమ్మ తల్లి గుడి శివారులో భక్తులకు చిరుత పులి కనిపించిందని పలువురు చెప్పిన నేపథ్యంలో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఎటువంటి చిరుత పాదముద్రలు లభించలేదని స్పష్టం చేశారు. చిరుత ఎవరికైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అయితే ఎవరూ ఒంటరిగా ప్రయాణించొద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.