
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి కోరారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రిని ఆయన BJP MLC అంజిరెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర (CRIF), రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 80 కోట్ల నిధులు, R&B కింద సింగిల్, డబుల్ లైన్ రోడ్ల నిధుల కోసం వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని MLA పేర్కొన్నారు.