
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి MLA పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 16 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడం జరిగింది. మంగళవారం బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు విగ్నేశ్వర గౌడ్, ఓంకార్ రెడ్డి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇందుకు కృషి చేసిన MLA రాకేష్ రెడ్డికి లబ్ధిదారులు రుణపడి ఉంటామని అన్నారు. నక్కల భూమారెడ్డి, ఏలేటి నవీన్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులున్నారు.