
జయ్ న్యూస్, ఆలూర్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆలూరు మండలం మిర్దపల్లి గ్రామానికి చెందిన గంగుబాయికి 10 లక్షల LOC కాపీని మంగళవారం హైదరాబాదులో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 40 రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో బాధితురాలు చేరింది. ఈ విషయాన్ని స్థానిక BJP నాయకులు MLA పైడి రాకేశ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 10 లక్షల LOC కాపీని మంజూరు చేయించారని BJP నాయకులు తెలిపారు.