
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మంగళవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. R&B రోడ్లకు, పంచాయతీరాజ్ రోడ్లకు, ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి, ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులను నియమించాలని, కావలసిన పరికరాలను కేటాయించాలని కోరారు. ప్రత్యేకంగా SDF నిధులు 20 కోట్లు కేటాయించాలని CM దృష్టికి వినయ్ రెడ్డి తీసుకెళ్లారు.