
జయ్ న్యూస్, భీమ్ గల్: అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు భాగంగా భీమ్గల్ పట్టణంలోని బుధవారం 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తో కలిసి ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోశారు. అలాగే లబ్ధిదారులకు ప్రోసిడింగ్ అందించడం జరిగింది. ఇందుకు సహకరించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డ్ ఆఫీసర్ కే. నవీన్, సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోధిరే స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ ఆరేపల్లి నాగేంద్రబాబు, 6వ వార్డ్ ఇంచార్జ్ మొండి దినేష్, నల్లూరి శీను, అనిల్, నవీన్,తోట నర్సయ్య, శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.