
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో B.Tech Orientation Programme ను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కపర్తి గురు చరణం విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య అనేది జీవితానికి పునాది అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, సమాజానికి గౌరవం తీసుకురావాలని సూచించారు. కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అది లేకపోతే ఎంతటి ప్రతిభ ఉన్న సరైన మార్గంలో ఉపయోగించలేమని పేర్కొన్నారు. సమయాన్ని విలువైనదిగా భావించి ప్రతిరోజు కొత్తగా నేర్చుకునే అలవాటు ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్ట్ లపై, ప్రాక్టికల్ నాలెడ్జ్ పై దృష్టిపెట్టాలని సూచించారు. ఫస్ట్ ఇయర్ HOD స్వప్న మాట్లాడుతూ మొదటి సంవత్సరం అనేది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది కాబట్టి, ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో, నిబద్ధతతో చదవాలని సూచించారు. కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.