
జయ్ న్యూస్, ఆర్మూర్: రాబోయే మూడు, నాలుగు గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నందున ఆర్మూర్ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రాజు కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప ఇండ్లలో నుండి ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ 98499 81643 ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు.