
జయ్ న్యూస్, ఆర్మూర్: భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి సూచించారు. ఆర్మూర్, ఆలూరు, నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్ మండల ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారు సురక్షితంగా తమ బంధువుల వద్దకు వెళ్లాలని సూచించారు. అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.