
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో కురిసిన భారీ వర్షాలకు జలమయం కావడంతో జెసిబితో సహాయక చర్యలు చేపట్టామని కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఏకధాటిగా కురిసిన వర్షాలకు జర్నలిస్ట్ కాలనీలో రోడ్డు జలమయం అయిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ యువసేన అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.