
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘం భవనంలో 27వ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం మహాగణపతి యజ్ఞం, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం అధ్యక్షులు రవినాథ్ మాట్లాడుతూ గత 26సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో సంఘం సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కోడిచెర్ల అరుణ్, యూత్ అధ్యక్షులు సంగ్వి ఆనంద్, యూత్ కోశాధికారి విజయ్, శ్రీ భాషిత సుందర్, సంఘం సభ్యులు తదితరులున్నారు.