
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ లు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని మంత్రి నియోజకవర్గంలో యూరియా పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా రైతులకు సరిపడా ఇస్తున్నామని వారు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పండిత్ పవన్, తదితరులు పాల్గొన్నారు.