
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు 162 రేషన్ కార్డులు పంపిణీ చేశారని యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. ప్రజలు మాట్లాడుతూ తమకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలు కూడా పూర్తి కానుందని త్వరలో గృహప్రవేశాలు కూడా ఉంటాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, మహేందర్, భూమారెడ్డి, రాజ్, నర్సయ్య, దిలీప్ రెడ్డి, జగత్ రెడ్డి, మోహన్ రెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.