
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంఘ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ యొక్క లావాదేవీలను సంస్థ అభివృద్ధిని అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సహకార బ్యాంకులను దాదాపు 100 సంవత్సరాల కంటే ముందు రైతుల అభివృద్ధి కొరకు స్థాపించడం జరిగిందని రైతులు పండించిన పంటకు రైతులకు లాభం చేకూరాలని ఆలోచనతో సహకార రంగాలను ప్రారంభించడం జరిగిందని, సహకార సంఘాలు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న ప్రతినిధుల ద్వారా సంస్థ నష్టాల్లోకి వెళితే ప్రస్తుతం నూతనంగా వచ్చిన కార్యవర్గ సభ్యులు అధికారులు కలిసి 17 శాతం నష్టాల్లో ఉన్న సంస్థను 10 శాతం రికవరీ చేసి లాభాల్లోకి తీసుకువచ్చినందుకు వారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ కంపెనీ అయిన ఇఫ్కో రసాయనిక యూరియా చల్లడం బదులు నానో యూరియా స్ప్రే మెరుగ్గా ఉంటుందని ఆలోచనతో యూరియాను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఎందుకంటే ప్రస్తుతం వాడుతున్న యూరియా ద్వారా క్యాన్సర్ బారిన ప్రజలు పడుతున్నారని అదేవిధంగా పంట పొలాలు కూడా యూరియా చల్లడం ద్వారా ఒకేసారి నలుపు కి వచ్చి తెగుళ్లను తట్టుకునే శక్తి క్షీణిస్తుందని తద్వారా తెగుళ్ల సమస్య ఎక్కువ అవుతుందని యూరియాను చల్లడం ద్వారా పంటకు కావాల్సిన అంత యూరియా తీసుకున్న తర్వాత మిగిలిన మిశ్రమం భూమిలో ఉండడం ద్వారా భూమి తన స్వభావాన్ని కోల్పోయి గట్టిగా మారుతుందని నీరును నిలువ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది అని తద్వారా భూమి గట్టి పడటంతో సౌడుగా ఏర్పడి పంట పొలాలు బీడు భూములగా మారుతున్నాయని వీటన్నింటిని అధిగమించడానికి రైతులకు నానో యూరియాను వాడాలని అధికారులు కూడా రైతులకు గ్రామాలలోకి వెళ్తూ నానో యూరియా పై అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా డ్రోన్లు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం కల్పించే దిశగా అడుగులు వేస్తుందని జిల్లాకు డ్రోన్లు తెప్పించి రైతులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అదేవిధంగా రైతులు పొలాలలో పంట మార్పిడి పద్ధతి అవలంబించాలని గతంలో నిజామాబాద్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో రైతులు రెండు సంవత్సరాలు చెరుకు వేసి మళ్లీ ఒక పంట వరి వేసే వారిని తద్వారా పంట మార్పిడి ద్వారా పంట పోలాలు సార్వంతంగా మారి దిగుబడి ఎక్కువ వచ్చేదని ప్రస్తుతం రైతులు కూడా పంటమార్పత్తి పద్ధతి అవలంబించి పెంచుకోవాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, నూడ చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, ఏడాపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.