
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పెట్రోల్ బంకు వద్ద, యోగేశ్వర్ కాలనీ వద్ద రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో మున్సిపల్ కమిషనర్ రాజు వెంటనే స్పందించి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో మున్సిపల్ శాఖ అధికారులు రోడ్లపై నిలిచిన నీటిని జెసిబితో తొలగింపజేశారు. వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ DE భరత్, AE కిరణ్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, హెల్త్ అసిస్టెంట్ సురేష్, వర్క్ ఇన్స్పెక్టర్లు, జవాన్ లు, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు.