
జయ్ న్యూస్, వేల్పూర్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున స్వచ్ఛతాన్ ఆఫ్ మారథాన్ రన్నింగ్ కు మన తెలంగాణ నుండి గుగ్గిలం అశోక్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అవడం మన తెలంగాణకి గర్వ కారణం… అశోక్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందినవాడు.. ఆయన పలు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలను సాధించారు. మన పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారంటే ఇన్ని రోజులు ఆయన పడ్డ కష్టానికి ఫలితం… ఆయన ప్రస్తుతం కామారెడ్డి జిల్లా రవాణా శాఖలో ఉద్యోగిగా కొనసాగుతున్నారు.