
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులు, పెద్దలు, చిన్నలు కలిసి ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళ లబ్ధిదారికి రెండు ఇందిరమ్మ చీరలు ఉచితంగా ఇవన్నట్లు మహిళా కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షురాలు మానకొండూరు సంధ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల చేనేత కార్మికుల చేత 65 లక్షల చీరలు తయారీకి ఆర్డర్ ఇచ్చింది.. మొత్తం 318 కోట్ల ఖర్చుతో దాదాపు తొమ్మిది కోట్ల మీటర్ల బట్టల తయారీకి అనుమతి ఇచ్చిందని ఇప్పటికే 36 లక్షల చీరలు సిద్ధం సెప్టెంబర్ 20 తేదీలోపు ఉత్పత్తి పూర్తి చేయమన్నారని ప్రతిచీర విలువ సుమారు 800 రూపాయలు ఉంటుందని ఈ చీరల పంపిణీ కార్యక్రమంతో తెలంగాణ ఆడపడుచులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత గౌరవం ఉందో దీనితో రుజువైందని మన సమాజానికి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల బతుకమ్మ చీరల పంపిణీతో పాటు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది.