
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: ఆర్మూర్ డివిజన్ జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పోతే రాజు,స్పోర్ట్స్ డ్రెస్ వితరణ చేశారు. కీర్తిశేషులు సాయిరాం ముద్దల, జ్ఞాపకార్థంగా క్రీడా దుస్తులు వితరణ చేశారు. పోతే రాజు మాట్లాడుతూ పాఠశాలకు, విద్యార్థులకు గాని ఉపయోగపడే విధంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడు అందిస్తానని అన్నారు. పడకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్, పోటీలు 18,19,20, తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు గాను బ్రాహ్మణపల్లి పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల వారి అవసరాలకు చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా పోతే రాజు, నీట్ శేఖర్, బాస్ రమేష్, బి.అశోక్, బ్రాహ్మణపల్లి వి డి సి, పూర్వ విద్యార్థి సయ్యద్ ఫయాజ్, నర్సారెడ్డి, పంచాక్షరి, లక్ష్మణ్,లు పాఠశాలకు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఆకుల గంగాధర్, పి రాణి, కోడె గంగా ప్రసాద్,పాఠశాల విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.