
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ నరేంద్ర స్కూల్ తో పాటు ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థినీలు, మహిళా ఉపాధ్యాయులు, సాంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి అందంగా అలంకరించారు. బతుకమ్మ పాటలు పాడుతూ విద్యార్థినీలు నృత్యాలు చేశారు. విద్యార్థినిలతో పాటు విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి బతుకమ్మ ఆడారు.
ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే ఆచారానికి ప్రతిక అని అన్నారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు బతుకమ్మ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతోనే బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన కల్పించడం కూడా ముఖ్యమే అన్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటామని తెలిపారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.