
జయ్ న్యూస్, ఆర్మూర్: నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికీ స్ఫూర్తిదాయకమని ER ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఉన్నారు.
ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో గల ఆయన విగ్రహానికి ER ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ఆయన ముందుండి నడిపించారన్నారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.