
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది సింధూకర్ చరణ్ కుమార్ చింతకుంట అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినయ్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వృద్ధులు భగవంతుడిని ప్రార్థించారు. న్యాయవాది చరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు అంకితమైన గొప్ప రాజకీయ నాయకుడు వినయ్ రెడ్డి అని అన్నారు.