
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తలారి రాకేష్ యువకులకు, విద్యార్థులకు సర్టిఫికెట్ల ఫైల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.