
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూరు మండలం కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎంపీడీవో గంగాధర్ బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో లబ్ధిదారులకు సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే గ్రామ, మండల అధికారులకు సమాచారం అందించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి శేఖర్, కాంగ్రెస్ నాయకులు మహేష్, శ్రీనివాస్ తదితరులున్నారు.