
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ తిరుమల గార్డెన్ లో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరి కష్టసుఖాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. కుల మత తారతమ్యాలు లేకుండా అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగును నిస్వార్ధంగా పిల్లలందరికీ సమపాళ్లలో విద్యను అందించే వారే గురువులు అని కొనియాడారు. సమాజంలో గురువు స్థానం గొప్పదని వివరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు చక్రధర్, సురేందర్, ఓబన్న పూర్వ విద్యార్థులు సునీల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్, సాయికుమార్ గౌడ్, హనుమండ్లు, లలిత, రమాదేవి, సురేఖ, సుజాత, వినోద, తదితరులు పాల్గొన్నారు.