
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ డివిజన్ స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికార్ల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు క్షణక్షణం అప్రమత్తతో ఉంటూ ఎలక్షన్ కమిషన్ సూచనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికార్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో DLPO శివకృష్ణ, ఆర్మూర్ MPDO శివాజీ, ఆలూరు MPDO గంగాధర్, ఆర్మూర్ MPO శ్రీనివాస్, MEO రాజగంగారం, RP లు సంగెం అశోక్, రాము, గంట అశోక్ తదితరులు పాల్గొన్నారు.