
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ పాల్గొన్నారు.
వినయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మండలంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, సీనియర్ నాయకులు పవన్, చేపూర్, పల్లె గ్రామాల అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, రాంసన్, మాజీ ఎంపీటీసీలు గంగాధర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.