జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు SSC 1994-95 బ్యాచ్ పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రింటర్ కం స్కానర్ వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్నేహలత తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యొక్క ప్రింటర్ కం స్కానర్ పాఠశాల విద్యార్థులకు విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పూర్వ విద్యార్థులు వితరణ చేయడం పట్ల మండల విద్యాశాఖ పక్షాన మరియు తొర్లికొండ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్నేహలత మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రింటర్ కం స్కానర్ వితరణ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యార్థులను పరీక్షల సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పూర్వ విద్యార్థి అశోక్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఇదే పాఠశాలలో చదువుకొని ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థి సంతోష్ మాట్లాడుతూ మా మిత్ర బృందం నా కోరిక మేరకు మా పాఠశాలకు జిరాక్స్ ప్రింటర్ వితరణ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హరికృష్ణ, సంతోష్, విజయలక్ష్మి, లలిత, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్, పాఠశాల పూర్వ విద్యార్థులు అశోక్, సాయిలు, శ్రీనివాస్, ప్రవీణ్, మనోహర్, రాజు, ప్రసాద్, శ్రీనివాస్ మరియు గజేందర్ లు పాల్గొన్నారు.
