జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అన్ని పంటలకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని AIUKS రాష్ట్ర అధ్యక్షులు V. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి.B. దేవారం లు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో అఖిలభారత ఐక్య రైతు సంఘం AIUKS ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభాకర్. కార్యదర్శి బి. దేవారంలు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతాంగానికి అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని, రెండు లక్షల రుణమాఫీ చేస్తానని, అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు.. కానీ ఏ ఒక్క వాగ్దానం 100% పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు అవుతుందని మొక్కజొన్న కో తకొచ్చి 20, 25 రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుందని విమర్శించారు.. మొక్కజొన్న రోడ్లపై ఆరబెట్టుకుంటుంటే తడుస్తున్నవి ఎండుతున్నవి కొంతమంది రైతులవి మొలక ఎత్తుతున్నయి.. దీంతో వ్యాపార దళారీ వర్గం 2400MSP దర ఉంటే కేవలం 1600 ,,1700కే కొనుగోలు చేస్తూ 15 రోజులకు డబ్బులు చెల్లిస్తామని వాయిదాలు పెడుతున్నారు.. ముందుగానే అకాల వర్షాలతో దిగుబడి ఒక ఎకరాన ఐదు ఆరు క్వింటాలు తక్కువయ్యాయి.. పెట్టిన పెట్టుబడి వెళ్లక రైతులు దివాలా తీసే స్థితికి వచ్చింది అని అన్నారు.. మరోవైపు అన్ని పంటలను కొనుగోలు చేస్తానని, పంటలకు క్వింటాల్‌కు 500 బోనసిస్తానని హామీ ఇచ్చి ఒక సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి 50% దాన్యానికే బోనస్ చెల్లించారు.. అసలు రహస్యం నిబంధనలో కొన్ని రకాల సన్నధాన్యానికే బోనస్ ఇచ్చే విధంగా రూపొందించారని ఇది రైతులు మోసం చేయడమే అవుతుందని గుర్తు చేశారు.. కులాల్లో ఏ బి సి డి లు పెట్టినట్లుగానే ధాన్యంలో కూడా ఏబీసీడి లు పెట్టే పద్ధతి రేవంత్ రెడ్డికే చెల్లుతుందని ఎద్దేవ చేశారు.. బే షరతుగా మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని.. ధాన్యాన్ని ఏబిసిడి లు లేకుండా, కొనుగోలు చేసి 500 బోనస్ బకాయి పడ్డ బోనస్ చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని బకాయి ఉన్న వారందరికీ మాఫీ చేయాలని రైతు భరోసా కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడని మీ రైతు వ్యతిరేక పద్ధతులు మార్చుకోక పోతే వరంగల్ డిక్లరేషన్ 100 శాతం అమలు చేయకపోతే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడతారని గుర్తు చేశారు.. వెంటనే మొక్కు జొన్నల, అన్ని రకాల ధాన్యాలకొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు S. సురేష్, కార్యదర్శి B కిషన్, డివిజన్ నాయకులు రాజన్న, ఆకుల గంగారం, జక్కం శేఖర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి G. కిషన్, తదితరులు పాల్గొన్నారు..
