జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TRSMA) నిజామాబాద్ జిల్లా ఎన్నికలు ఈ రోజు ఆర్మూర్లో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా పొలపల్లి సుందర్ (శ్రీ భాషిత స్కూల్, ఆర్మూర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్కిడ్ స్కూల్ నిజామాబాద్ ప్రతినిధి క్రాంతి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర కోశాధికారి రాఘవేందర్ రెడ్డి ఎన్నికల అధికారిగా పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లా TRSMA అధ్యక్షుడు వేదం శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికలకు పరిశీలకుడిగా హాజరయ్యారు.


జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొని నూతన నాయకులకు అభినందనలు తెలిపారు. సుందర్, కాంతి నాయకత్వంలో TRSMA నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించి, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుందని సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. సభ చివర్లో ధన్యవాదములతో కార్యక్రమం ముగిసింది. TRSMA సభ్యులందరూ ఏకతా, అభివృద్ధి దిశగా కట్టుబడి పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.
