జయ్ న్యూస్, ఆర్మూర్: రేపు జరగబోయే ఆర్మూర్ క్షేత్రీయ ఫంక్షన్ హాల్ లో ఆర్మూర్ పట్టణ పద్మశాలిల_ అలయ్ బలయ్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఈరోజు ఆర్మూర్ ఈ.ఆర్.ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ గారి ఆధ్వర్యంలో రాజశేఖర్ గారినీ ఆహ్వానించారు, ఫౌండేషన్ తరపున అన్న దాన కార్యక్రమానికి ముందుకు రావడం రాజశేఖర్ గారిని అభినందించారు, పట్టణ పద్మశాలి సంఘ ప్రతినిధులను ఫౌండేషన్ కార్యాలయానికి సాదరంగా ఆహ్వానించారు,పట్టణ పద్మశాలి సంఘం నేతలు రావడం నాకు ఆనందదాయకం అని పద్మశాలి కార్యక్రమాలకు తను ఎప్పుడూ అండగా ఉంటానని రాజశేఖర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్,కార్యదర్శి కొక్కుల రమాకాంత్, ఆర్మూర్ పట్టణ సర్వ సమాజ సంఘ సభ్యులు ఐడియా సాగర్, పట్టణ రెండవ సంఘం అధ్యక్షులు బండి అనంత రావు,ఎల్ ఐ సి భాస్కర్,ప్రభాకర్, ఇతర పద్మశాలి ప్రముఖలు పాల్గొన్నారు
