జయ్ న్యూస్, కామారెడ్డి: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కడమంచి అర్జున్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కడమంచి అర్జున్ అల్లు అర్జున్ రాష్ట్ర అసోసియేషన్లో సముచితస్థానం దక్కింది. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటలో లో నిర్వహించిన సమావేశంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా
కామారెడ్డి జిల్లాకు అధ్యక్షుడుగా ఉన్న కడమంచి అర్జున్ రాష్ట్ర స్థాయిలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లాలో కడమంచి అర్జున్ విజయవంతంగా నిర్వహస్తున్నారు. నూతనంగా ఎన్నికైన సంయుక్త కార్యదర్శిగా కడమంచి అర్జున్ కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాత బన్నీ వాసులు కలసి నియామక పత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా కడమంచి అర్జున్ అల్లు అర్జున్ కు మరియు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
