జయ్ న్యూస్, ఆర్మూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంలో బిసి సంఘాలు ఇచ్చిన రేపటి బంద్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తెలిపారు. రేపు జరగబోయే బంద్ కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తూ బంద్ పాటిస్తున్నట్టు ఆర్మూర్ మండల ట్రస్మ అధ్యక్ష కార్యదర్శులు భారత్చంద్ర మల్లయ్య, విద్య ప్రవీణ్ పవార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి స్కాలర్స్ వేణు, రాష్ట్ర ప్రతినిధి కాంతి గంగారెడ్డి లు తెలిపారు.
