జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ కేసరి దినపత్రికలో రెండోసారి రాష్ట్రస్థాయి ఉత్తమ విలేకరిగా ఎంపికై అవార్డు పొందిన సాత్ పుతే శ్రీనివాస్ కు నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పార్దేం సంజీవ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ సీనియర్ రిపోర్టర్ గా ఉన్న శ్రీనివాస్ ప్రజల సమస్యలతో పాటు అక్రమాలు అవినీతి అక్రమాలపై చక్కటి వార్తలు రాశారన్నారు. రాబోయే రోజుల్లో తన కలంతో మరిన్ని ప్రజల సమస్యలపై వార్త కథనాలు రాయాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ జర్నలిస్టుగా ఎంపికైనందుకు ప్రెస్ క్లబ్ లోని సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అమృతాల శ్రావణ్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వినోద్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, కోశాధికారి లిక్కి శ్రావణ్, సంయుక్త కార్యదర్శి ముకేష్, సలహాదారులు షికారి శ్రీనివాస్, మహేష్, సభ్యులు ఖోడే మనోహర్, గణేష్ గౌడ్, విన్సెంట్, భారడ్ గణేష్, చరణ్ గౌడ్, రాజేందర్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
