జయ్ న్యూస్, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్: వర్షాల తాకిడితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరికొండ, ధర్పల్లి మండలాల్లో వేల క్వింటాళ్ల వరి నీటిలో తేలిపోతోంది. కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ప్రారంభించినా, ధాన్యం సేకరణ మాత్రం నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైస్ మిల్లులకు సివిల్ సప్లై శాఖ ఇంకా అలాట్మెంట్లు ఇవ్వకపోవడంతో రైతుల కష్టాలు తారాస్థాయికి చేరాయి. రోడ్లపైనే వరి కుప్పలతో రాత్రింబవళ్లు గడుపుతున్న రైతులు… ప్రభుత్వం వెంటనే స్పందించాలనీ, అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
