జయ్ న్యూస్, ఆర్మూర్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎపిఎం భూమేశ్వర్ గౌడ్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకాంట్టి చిన్నారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకి క్వింటాల్ కి 2,389 రూపాయలను రైతులకు చెల్లిస్తుందన్నారు. రైతులు పండించిన పంట చివరి గింజా వరకు కొంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్, సీసీ ప్రవీణ్, సి ఎ అనిత. సింధుకర్ అమల, మాజీ ఉప సర్పంచ్ లు నడుకూడా శ్రీనివాస్ రెడ్డి, కటికే శ్రీనివాస్, న్యాయవాది చరణ్, మాజీ వార్డు మెంబర్ సభ్యుడు రాజు, విడిసి కోశాధికారి కొండ్రా రంజిత్, భూమన్న, రాము, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు బద్దం రాజు తదితరులు పాల్గొన్నారు.
