జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం అమ్దాపూర్ గ్రామంలో పిప్రి PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు హేమంత్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర 2400 రూపాయలు ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గంగాధర్, రాజు, CEO హన్మండ్లు, VDC సభ్యులు రైతులు పాల్గొన్నారు.
